
సబ్ కలెక్టర్ నూరుల్ కమర్: టెక్కలి : ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై తుది జాబితాను ఈనెల 29వ తేదీన విడుదల చేయనున్నట్లు టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబరులో రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితాపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన తుది జాబితా ప్రచురణ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల రీత్యా 29వ తేదీకి వాయిదా వేశామన్నారు. తుది జాబితాలో ఏమైనా ఆభ్యంతరాలు ఉంటే ఫారం-6, 7, 8 వినియోగించుకోవాలన్నారు. కోటబోమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన సుమారు 50 ఓట్లు సంతబొమ్మాళి మండలం జగన్నాథపురంలో కలిసిపోయాయని, వాటిని వెనక్కి తెప్పించి సవరణ చేపట్టాలని జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్‌కుమార్ కోరారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ పరిశీలించి చర్యలు తీసుకుం టామన్నారు. సంతబోమ్మాళి మండలం సీతానగరంలోని పోలింగ్ కేంద్రంలో సౌకర్యాల్లేవని, మెరుగుపరచాలన్నారు. సమావేశంలో తహశీల్దార్ కె.ప్రవళ్లికప్రియ, టిడిపి మండల అధ్యక్షులు బగాది శేషగిరి, పెదరట్టి మణి, వైసిపి మండల అధ్యక్షులు బగాది హరి, ఎ.రాహుల్‌కుమార్ పాల్గొన్నారు.