పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు
29 న గుంటూరు లో
నూర్ భాషా దూదేకుల ముస్లిం సింహ గర్జన
-నూర్ భాషా దూదేకుల ముస్లిం యువజన సంక్షేమ సంఘం
ప్రజాశక్తి-నెల్లూరు:ఈనెల 29న గుంటూరులో ఎపి నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న నూర్ భాషా/ దూదేకుల ముస్లిం సింహ గర్జన కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ సుభాన్ భాష పిలుపునిచ్చారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూర్ భాషా దూదేకుల ముస్లిం వర్గీయుల అభివద్ధి సంక్షేమం గత 76 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలానే ఉందన్నారు. నూర్ భాషా దూదేకుల ముస్లింలు అభివద్ధి సంక్షేమం సాధించాలంటే తప్పనిసరిగా చట్టసభలలో ప్రాధాన్యత పొందాల్సి ఉందన్నారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో నూర్ భాషా దూదేకుల ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ, రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూర్ భాషా దూదేకుల ముస్లింల ఓటు బ్యాంకును ప్రముఖ జాతీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయి తప్ప, వారి అభివద్ధి సంక్షేమంపై ఏమాత్రం దష్టి సారించిన లేదని తమ ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 29న గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కాలేజీలో నిర్వహించనున్న ,నూర్ భాషా దూదేకుల ముస్లిం సింహ గర్జనకు జిల్లాలోని నలుమూలల నుండి అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అల్తాఫ్ ,సాయిబాబు , షేక్ షరీఫ్ ,హజ్రత్ అలీ, జహీర్ భాష, నిర్మల్ ,నవాజ్ ,అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.










