28న నగరికి సిఎం రాక
పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, కలెక్టర్, ఎస్పీ
ప్రజాశక్తి- నగరి: ఈనెల 28న నగరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి రానున్నారని రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, భూగర్భ, గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న విద్యా దీవెన పథకాన్ని బటన్ నొక్కి ప్రారంభించనున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్య మంత్రి నగరి పర్యటనకు సంబంధించి బహిరంగ సభ, హెలిప్యాడ్స్ ఏర్పాట్లును మంత్రి పరిశీలించారు. నగరిలో జరగనున్న సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఈనెల 28న చిత్తూరు జిల్లా నగరి పర్యటనను విజయవంతంగా నిర్వహిదామని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం నగరి మున్సిపల్ కార్యాలయం సమావేశం హాల్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర సాంస్కతిక, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కె.రోజా, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్.రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, జిల్లా ఎస్పి వై.రిశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్యేలు సత్యవేడు, పూతలపట్టు అదిమూలం, ఎంఎస్.బాబు, జేసి పి.శ్రీనివాసులు, డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్‌లతో కలసి ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై అన్నిశాఖల అధికారులతో సమన్వయ సమావేశము నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు కషితో చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలను రాష్ట్ర స్థాయిలోనే బాగా నిర్వహించడం జరిగిందని, ఈనెల 28న నగరి లో జగనన్న విద్యాదీవెన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సందర్భంగా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహించుటకు అధికారులు కషి చేయాలన్నారు. అంతకు ముందు నగరి పర్యటనలో ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ, రోడ్డుషో, ముఖ్యమంత్రి అరైవల్, డిపార్చర్‌లకు సంబంధించి హెలిప్యాడ్స్ గ్రౌండ్స్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు పనులను, మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలసి పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా అధికారు జాగ్రత్తగా ఎవ్వరికీ కేటాయించిన పనులను వారు సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, డిఆర్డీఏ, మెప్మా పిడిలు, తులసి, రాధమ్మ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యూఎస్, ఎపిఎస్‌పిడిసిఎల్‌ఎస్‌ఈలు చంద్ర శేఖర్‌రెడ్డి, ఉమామహేశ్వర రావు, శంకర్ బాబు, కష్ణారెడ్డి, డీఈఓ విజయేంద్ర రావు, సమగ్రశిక్ష ఏపి సి.వెంకట రమణారెడ్డి, ఆర్‌టిసి ఆర్‌ఎం. జితేంద్ర నాధ్‌రెడ్డి, డిటిసి నిరంజన్ రెడ్డి, డిపిఓ లక్ష్మీ, పౌరసరఫరాల శాఖ డిఎం.మోహన్ బాబు, డిఎల్‌డిఓ రవి కుమార్, నగరి, ఆర్డీఓలు సుజన, డ్వామా ఏపిడి ఉమాదేవి, నగరి మున్సిపల్ కమీషనర్ వెంకట్రామి రెడ్డి, తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపిడిఓ లీలా మాధవి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.










