Mar 21,2022 23:40

సమ్మె కరపత్రాలు ఆవిష్కరిస్తున్న దృశ్యం

అంగన్వాడి వర్కర్లను అరెస్టు చేయడం కాదు
మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి!!

 సమ్మె కరపత్రాలు ఆవిష్కరణ
ప్రజాశక్తి-రేణిగుంట: దేశ వ్యాప్తంగా మార్చి 28, 29 రెండు రోజుల పాటు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలు సోమవారం ఆవిష్కరించారు. మంచినీళ్ల కుంట వద్ద ఉన్న అంగన్వాడి సెంటర్‌ వద్ద కార్యకర్తలతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి నుండి రేణిగుంటకు అంగన్వాడీ జాతాకి జిల్లా నాయకులు అదే విధంగా మండల నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ మాట్లాడుతూ..అంగన్వాడీ వర్కర్స్‌,హెల్పర్స్‌ ని రెగ్యులర్‌ చేయమని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ క్రింద 5 లక్షలు ఇవ్వాలన్నారు. తెలంగాణా కంటే ఎక్కువ వేతన రూపంలో ఇవ్వాలని, బకాయి జీతాలు, బిల్లులు ఇవ్వాలని రిటైర్‌ అయిన వర్కర్‌ స్తానంలో హెల్పరకి రాజకీయ జోక్యం లేకుండా జరిగేటట్టు చూడాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడి యూనియన్‌ చంద్రగిరి ప్రాజెక్టు అధ్యక్షురాలు ధనమ్మ మాట్లా డుతూ.. అంగన్వాడీ వర్కర్లకు మొబైల్‌ ఫోన్లు కొత్తగా ఇవ్వాలని, యాఫ్లు తగ్గించాలన్నారు. కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అంగన్వాడీలను పాఠశా లలో కలిపితే వర్కెర్స్‌ని పర్మినెంట్‌ చేసి కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయ కులు బాలసుబ్రహ్మణ్యం, మునిరాజా, అంగన్వాడి యూనియన్‌ జిల్లా కార్యదర్శి వాణిశ్రీ, చంద్రగిరి ప్రొజెక్ట్‌ అధ్యక్షురాలు ధనమ్మ, సిఐటియు మండల కార్యదర్శి హరినాధ్‌, మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, సీనియర్‌ నాయకులు వెంకటరమణ, టీచర్‌ సురేష్‌, అంగన్వాడి యూనియన్‌ సెక్టార్‌ లీడర్లు అంబిక, ప్రభ, ధరణి, పార్వతి, గుర్రమ్మ, వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ పాల్గొన్నారు.