27న డ్రాఫ్ట్ పబ్లికేషన్
జనవరి 5న ఫైనల్ పబ్లికేషన్: డిఆర్‌ఓ
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతోందని, ఈనెల 27న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఉంటుందని జనవరి 5న ఫైనల్ పబ్లికేషన్ ఉంటుందని జిల్లా రెవిన్యూ అధికారి ఎన్. రాజశేఖర్ అన్నారు. బుధవారం డిఆర్‌ఒ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఉంటుందన్నారు. నవంబర్ 4, 5, డిసెంబర్ 2,3 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో బిఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు. ఆ తేదీల్లో మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కసరత్తు జరిగే సమయంలో బిఎల్‌ఏలు అందుబాటులో ఉండేటట్లు ఆయా పార్టీల ప్రతినిధులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మాక్ పోలింగ్ నిర్వహించబడుతుందని తెలిపారు. డిసెంబర్ 27న సెప్టెంబర్ 30 వరకు చేసిన మార్పులు చేర్పులు పరిశీలనలోకి తీసుకొని జనవరి 5వ తేదీన ఓటర్ల జాబితా తుది పబ్లికేషన్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ బ్యూలా, సిపిఎం నుంచి గంగరాజు, వైఎస్సార్‌సీపీ నుంచి ఉదయకుమార్, కాంగ్రెస్ నుంచి పరదేశి, బిజెపి నుంచి శ్రీనివాసులు హాజరయ్యారు.










