Oct 24,2023 17:34

మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి నెల్లూరు : అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సు కోసం సమగ్ర చట్టం తేవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగం కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 27న రాష్ట్ర స్థాయి సదస్సును నగరం లోని జెట్టి శేషా రెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు పాల్గొంటారన్నారు. భవన నిర్మాణ కార్మికులు ,హమాలీలు, రోడ్డు మార్జిన్‌ కార్మికులు, ఆటో, మున్సిపల్‌ కార్మికులు ఇలా అనేక రంగాల కార్మికులు సమస్యల మీద ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరుగుతుందన్నారు. కార్మికుల వేతనాలు , న్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు సాధన కోసం నిర్వహించాల్సిన పోరా టాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సు మారు కోటి మంది అసంఘటి తరంగ కార్మికులు వివిధ రంగా ల్లో పని చేస్తున్నారని సిఐటి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరు కుమార్‌ తెలిపారు. జాతీయ ఉత్పత్తి జిడిపి లో 67 శాతం ఆదాయం ఆ కార్మికులు శ్రమ ద్వారా ప్రభుత్వానికి వస్తుందన్నారు. అటువంటి కార్మికులు తమ శేషజీవితాన్ని దయనీయంగా గడుపుతున్నా రని తెలిపారు. గత ఎన్నికల సమయంలో వైసిపి నేతలు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర శాసనం అసం ఘటిత కార్మికులు శ్రేయస్సు కోసం తీసుకొస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నా లు చేయలేదన్నారు. దేశంలో, రాష్ట్రం లో, జిల్లాలో అసంఘటిత రం గంలో పని చేస్తున్న కార్మికులు ఉత్పత్తిలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కార్మిక చట్టాలు అమలు కావడం లేదని సిపి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్‌ రావు తెలిపారు. ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని రూపొందించి అసంఘటిత రంగంలో కార్మికుల శ్రేయస్సుకు కషి చేయాల న్నారు. ఈ నేపథ్యంలో 27న నగరంలో జరిగే సదస్సుకు అ సంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.