Aug 16,2023 21:23

25న నగరికి సిఎం రాక
ఏర్పాట్లపై అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ సమీక్ష

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఈనెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి నగరి పర్యటనను అన్ని శాఖల అధికారు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశం హాల్‌లో అడిషనల్‌ ఎస్పీ సుధాకర్‌, డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌తో కలసి సిఎం నగరి పర్యటనకి సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అన్నిశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 25న నగరి పట్టణంలో జగనన్న విద్యాదీవెన పంపిణీ కార్యక్రమానికి రానున్నారని, ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని వారికి కేటాయించిన పనులను పూర్తి చేయాలన్నారు. అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించి ఎటువంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి శాఖల వారీగా కేటాయించిన విధులు నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి, డిఆర్డీఏ, మెప్మా, డ్వామా, హౌసింగ్‌ పిడిలు, తులసి, రాధమ్మ, గంగాభవాని, పద్మనాభం, ఎస్‌ఈ పంచాయతీరాజ్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, డీఈఓ విజయేంద్ర రావు, బిసి సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖల డీడీలు రబ్బానీ బాషా, డాక్టర్‌ రాజ్యలక్ష్మి, సమగ్ర శిక్ష పిఓ వెంకట రమణారెడ్డి, ఆర్‌టిసి ఆర్‌ఎం జితేంద్రనాధ్‌ రెడ్డి, డిటిసి నిరంజన్‌ రెడ్డి, విద్యుత్‌ శాఖ ఈఈ హరి, డిఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ ప్రభావతి దేవి, డిపిఓ లక్ష్మీ, సిపిఓ ఉమాదేవి, సమాచార శాఖ ఇంచార్జి డిడి పద్మజ, చిత్తూరు ఆర్డీఓ రేణుక పాల్గొ న్నారు.