మాట్లాడుతున్న నాయకులు
22న షాదిమంజిల్‌పై సమావేశం
ప్రజాశక్తి-కావలి:కావలిలో 22న తేదీ ఉదయం 10 గంటలకు షాదిమంజిల్‌పై ''షాదీమంజిల్'' ఆవరణలో జరిగే సమావేశానికి విచ్చేసి, తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని ''కావలి ముస్లిం వెల్ఫేర్ సొసైటీ'' నాయకులు పేర్కొన్నారు. గురువారం కావలి పట్టణంలోని రైల్వే రోడ్డులోని జర్నలిస్టు క్లబ్‌లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావలి పట్టణం లోని అన్ని మసీదుల ప్రెసిడెంట్లు (ముతవల్లులు) కమిటీ సభ్యులు, ముస్లిం విద్యావంతులు, మేధావులు, ఆలోచనాపరులు, యువకులు, మా ఆహ్వానాన్ని అందుకొని ముందుకు రావాలని కోరారు. కావలి పట్టణంలో అధిక సంఖ్యలోని ముస్లింలు, ఆర్ధిక స్థోమత లేక సొంత ఇళ్లు లేక ఎక్కువ భాగం బాడుగ ఇళ్లలో నివసిస్తున్నారని తెలిపారు. పేదలు పెళ్లిళ్లు జరుపుకునేందుకు వసతులు లేక పట్టణంలోని కళ్యాణ మండపాలకు వేల రూపాయలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించారు.వారు చేసిన కషి వల్ల ప్రభుత్వం మనకు పట్టణంలోని వివేకానంద పార్కు పక్కన కళ్యాణ మండపం నిర్మించు కొనుటకు స్థలాన్ని మంజూరు చేశారు.రాజకీయాలకు అతీతంగా అందజేసిన ఆర్థిక సహాయ సహకారాలతో మనం ఒక షాదీ మంజిల్ ను నిర్మించుకోగలిగామన్నారు. షాదీ మంజిల్ నిర్మాణం జరిగి, సంవత్సరాలు అవుతున్నా భవనానికి కొద్దిపాటి మరమ్మతులు చేయకుండా పోయినందు వలన భవనం దెబ్బతిందన్నారు. ఒకప్పుడు ఈ షాదీ మంజిల్ లో కార్యక్రమం జరుపుకొనుటకు ముస్లింలే కాక, ముస్లిం ఇతరులు కూడా ఆసక్తి చూపి వారి వారి కార్యక్రమాలు నిర్వహించుకునే వారు అని తెలిపారు. ఈ నెల 22 వ తేదీ ఆదివారం ఉదయం 10 గంట లకు ''షాదీమంజిల్''ఆవరణలో జరిగే సభకు విచ్చేసి తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్. కె.మస్తాన్, సిరాజ్ బాషా, నజీర్ భాషా, నజీర్‌బాషా, హజరత్, జిలాని భాషా, దస్తగిరి భాషా, రఫీ అహ్మద్, జిలానీ, నిజాముద్దీన్, రఫీ పాల్గొన్నారు.










