Sep 12,2022 23:22

22న కుప్పంకు ముఖ్యమంత్రి రాక
పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి
ప్రజాశక్తి-కుప్పం:
ఈనెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కుప్పంకు రానున్నారు. ఈనేపథ్యంలో సోమవారం ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖామాత్యులు కె.నారాయణ స్వామి, రాష్ట్ర అటవీ, ఇందన, విద్యుత్‌ శాస్త్రసాంకేతిక శాఖామాత్యులు డాక్టర్‌పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు పార్లమెంట్‌ సభ్యులు ఎన్‌.రెడ్డప్ప, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనల రాష్ట్ర సలహాదారులు తలశీల రఘురాం, జడ్పీచైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లాకలెక్టర్‌ యం.హరి నారాయణన్‌, జిల్లా ఎస్‌పి రిశాంత్‌రెడ్డి, చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వెంకటేగౌడ్‌, ఎంఎస్‌.బాబు, ఎంఎల్‌సి భరత్‌లతో కలసి హెలిప్యాడ్‌, బహిరంగసభ నిర్వహణకు స్థలాల పరిశీలన చేశారు. ఇందులో భాగంగా కుప్పం పిఈఎస్‌ కళాశాల, బంగారునత్తంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు, బహిరంగ సభ నిమిత్తం ఎన్‌టిఆర్‌ స్టేడియం, అనిమిగానిపల్లి వద్ద స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోడి ఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్‌ కుమార్‌, పికెఎం చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర జానపద కళల అభివద్ధి సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఏపిఎస్‌ఆర్‌టిసి రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, డిసిసిబి ఛైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, రెస్కో చైర్మన్‌ సెంథిల్‌ కుమార్‌, చిత్తూరు నగర మేయర్‌ అముద, నాయకులు ఎంఆర్‌సి రెడ్డి, కుప్పం మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌, కుప్పం ఆర్‌డిఓ శివయ్య, డిఆర్‌డిఏ, డ్వామా పీడీలు తులసి, చంద్రశేఖర్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ దేవానందం, డీఈఓ పురుషోత్తం, డిటిసి బసిరెడ్డి, సమగ్రశిక్ష ఎపిసి వెంకటరమణరెడ్డి, వివిధశాఖల జిల్లాస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన గెస్ట్‌ ఫ్యాకల్టీ అధ్యాపకులు
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను కాంట్రాక్ట్‌ వ్యవస్థలోకి విలీనం చేయాలని, ప్రతి సంవత్సరం విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే రెన్యువల్‌ ఇస్తూ ,12 నెలల జీతం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గెస్ట్‌ ఫ్యాకల్టీ అధ్యాపకులు గనులు శాఖ మరియు విద్యుత్‌శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటల్ల పరిశీలనలో భాగంగా కుప్పంకు వచ్చిన పెద్దిరెడ్డికి వారు వినతిపత్రం అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
బైరెడ్డిపల్లిలో మంత్రికి ఘనస్వాగతం
బైరెడ్డిపల్లి: ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మండలంలో డిసిసిబి చైర్‌పర్సన్‌ మొగసాల రెడ్డమ్మ, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కృష్ణమూర్తి ఇంటికి విచ్చేసి వారి ఆతిథ్యం స్వీకరించారు. వారి వెంట డిప్యూటి సిఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.