Aug 17,2022 23:09

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నసురేష్‌ బాబు

ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌
క్రిస్న్‌ క్రియేషన్స్‌ బేనర్‌ పై ఈనెల 21వ తేదీ వకాలత్‌ నామ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుందని ఆ సినిమా కథా నాయకుడు కుల్లపు రెడ్డి సురేష్‌ బాబు తెలిపారు. బుధవారం చిత్తూరు ప్రెస్‌ క్లబ్‌ లో సురేష్‌ బాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. క్రిస్న్‌ క్రియేషన్స్‌ బేనర్‌ పై ఈనెల 21వ తేదీ వకాలత్‌ నామ సినిమా షూటింగ్‌ హైదరాబాదులో వైభవంగ అతిరథ మహారధులతో ప్రారంభించడం జరుగుతుందన్నారు. వకల్తా నామా సినిమాలో చాలా మంది న్యాయ వాదులు, రిటైర్డ్‌ జడ్జి లు ,ఉచితంగా నటిస్తున్నారని చెప్పారు. కక్షిదారులకు మానం, మర్యాద , గౌరవం న్యాయం అందించేది న్యాయవాది అని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి చెందిన తాను మాత్రమే తన సొంత భూమి మీద ప్రేమతో తన గ్రామానికి ఏదైనా చేయాలన్న తలంపుతో ఉన్నట్లు తెలిపారు. తమ చిత్రంలో నూతన, సీనియర్‌ నటులు ఉంటారన్నారు. న్యాయం కోసం ప్రతి ఒక్కరు కోర్టును ఆశ్రయిస్తారని తెలిపారు. ప్రతి కక్షిదారులు తమ లాయర్‌ వద్ద వకాలత్‌ లో సంతకం పెట్టి న్యాయం కోసం వస్తారన్నారు. వీరికి అన్ని విధాలుగా న్యాయం అందేలా లాయర్లు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి న్యాయం కోసం వాదిస్తారని పేర్కొన్నారు. తమ సినిమాలో మహిళకు జరిగిన అన్యాయంపై ఎదుర్కొన్న సమస్యలపై సినిమా ఉంటుందన్నారు. ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్క న్యాయవాది కూడా హీరో గానే ఉంటారని తెలిపారు. చిత్తూరు జిల్లా లో కూడా షూటింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు.