Aug 19,2023 00:50

21 లోపు ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2024లో భాగంగా ఇంటింటి సర్వే ఈ నెల 21 కల్లా వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఈఆర్‌ఓ లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించా రు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ నుండి జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌, డిఆర్‌ ఓ యన్‌.రాజ శేఖర్‌, ఎన్నికల విభాగం అధికారులు హాజరయ్యా రు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా కోసం చేపట్టిన ఇంటింటి సర్వే పురోగతిపై జిల్లాల వారీగా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఫారం 6 కొత్త ఓటర్లకు 18 సంవత్సరాల నిండిన వారికి ఇవ్వాలని, ఫారం 8 చిరునామా మార్పులు కొరకు ఇవ్వాలన్నారు. ఓటర్లు తొలగింపు సంబంధించి ప్రొసీజర్‌ ప్రకారం జాగ్రత్తగా చేయాలన్నారు. అలాగే పలు అంశాలపై అందుకు సం బంధించిన కార్యాచరణపై జిల్లాలోని అన్ని నియో జకవర్గాల ఈఆర్‌ ఓలు, ఏఈఆర్‌ ఓలకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చెప్పటడం జరుగు తుందని రాష్ట్ర ఎన్నికల అధికారికి కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో హౌస్‌ టు హౌస్‌ డోర్‌ సర్వేకి సంబంధించి ఇప్పటి వరకు 91.84 శాతం చేయడం జరిగిందని మిగిలినది కూడా మూడు రోజులలోగా పూర్తి చేయ డం జరుగుతుందని, బియల్‌ ఓ యాప్‌లో 66.87 శాతం చేయడం జరిగింది,ఫిసికల్‌ గా 26.78 శాతం చేయడం జరిగిందని మిగిలిన మూడు రోజుల లోగా పూర్తి చేయడం జరుగుతుందని, జిల్లాలో 100 సంవ త్సరాల పై బడిన ఓటర్లు132 మంది ఉన్నారని, 132 మందిని వెరీఫీడ్‌ చేయడం జరిగిందని వారిలో 43 పార్మ్స్‌ తీసుకోవడం జరిగిందని సిఈఓ కు కలెక్టర్‌ తెలిపారు. 6,7,8 ఫారం ద్వారా వచ్చినవి, ఆఫ్‌ లైన్‌ నుండి ఆన్‌లైన్‌లో అప్‌ లోడు చేయడంజరుగుతుందని తెలిపారు. గత బుధవారం గుర్తింపు పొందిన రాజ కీయ పార్టీల నాయకులతో సమావేశము నిర్వహించి వారికి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఎలక్షన్‌ సెక్షన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.