21, 22 న ఏపీపీఎస్‌సీ పరీక్షలు
అ 390 మంది అభ్యర్థులకు పరీక్ష కేంద్రం ఒక్కటి అ అభ్యర్థులు ఉదయం 9 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి అ డి ఆర్ ఓ.యన్.రాజశేఖర్
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్ : జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లాలో రెండోసారి ఏపీపీఎస్‌సీ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించా లని డిఆర్‌ఒ యన్.రాజశేఖర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం డిఆర్‌ఒ ఛాంబర్‌లో ఏపీపీఎస్‌సీ పరీక్షలు ఈనెల 21, 22న తేదీ లలో (సోమవారం, మంగళవారం) చిత్తూరు పట్టణంలో నిర్వహిం చునున్న ఏపీపీఎస్‌సీ పరీక్షల నిర్వహణపై డిఆర్‌ఒ సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ అ త్యంత ప్రాధాన్యత కలిగిన ఉద్యోగాలకు ఏపీపీఎస్‌సీ ద్వారా పరీక్ష లు నిర్వహిస్తున్నందున, చిన్న పొరపాటు లేకుండా జాగ్రత్తగా నిర్వ హించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు పట్ట ణంలో ఒక్క పరీక్ష కేంద్రం శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ (సీతమ్స్), తిరుపతి - బెంగుళూరు బై పాస్ రోడ్, మురుకంబట్టు, పరీక్ష కేంద్రాలలో 390 మంది అభ్యర్థులకు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఆగస్టు 21 న మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వర కు, 130 మంది అభ్యర్థులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పేపర్ 1. వ్రాయనున్నారు.ఆగస్టు 22 న ఉదయం 9.30 గంటల నుండి 12 వరకు. 130 మంది అభ్యర్థులు సివిల్ అండ్ మెకాని కల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పేపర్ 2 పరీక్ష వ్రాయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుండి సా యంత్రం 5 గంటల వరకు రెండు సెషన్ లలో 130 మంది అభ్య ర్థులు సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పేపర్ 3. పరీక్షలు వ్రాయనున్నారని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా సమయానికి గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. హాల్ టికెట్‌తో పాటుగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఐడి ప్రూఫ్ (డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు, ఉద్యోగి అయితే ఎంప్లారు ఐడి కార్డు) తీసుకురావాలని తెలిపారు. ఓఎంఆర్ షీట్ లలో బ్లూ మరియు బ్లాక్ బాల పాయింట్ పెన్స్ మాత్రమే వాడాలని, హాల్ టికెట్ పై ఫోటో స్పష్టత లేని, సంతకం సరిగా కనిపించని నేపథ్యంలో అభ్యర్థులు 3 పాస్ పోర్ట్ సైజు ఫోటోలపై గెజిటెడ్ అధికారి ధృవీకరణ తీసుకొని రావాలని, సెల్ ఫోన్‌లు, క్యాలిక్యులేటర్‌లు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు వం టి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాల పరీక్ష కేంద్రాలలోకి అనుమతిం చబడవని తెలిపారు.
పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తున్న డిఆర్‌ఒ










