Sep 02,2022 23:05

సమావేశంలో ఆశా వర్కర్స్‌

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
కోవిడ్‌ కాలంలో ఆశా వర్కర్స్‌ ప్రాణాల కు తెగించి ప్రజలకు సేవలు అందించారని, వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలను, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రూప్‌ ఇన్సూరెన్సు కోసం ఈ నెల 20 న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా జరుగుతుందని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గంగ అధ్యక్షత న జరిగిన ఆశా వర్కర్స్‌ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నా యని ,డీజిల్‌, పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధరల ను కేంద్ర ప్రభుత్వం పెంచి ప్రజల పై లక్షల కోట్ల రూపాయల భారం మోపిందని, మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం కరెంట్‌ చార్జీలు, చెత్త పన్ను ,ఆస్తి ఆధారిత పన్ను భారాలు మోపి ప్రజల బాధలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. ఆశాల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. ఆశా యూనియన్‌ జిల్లా ప్రెసిడెంట్‌ గంగ, సహాయ కార్యదర్శి మల్లనూర్‌ లక్ష్మీ, ఉపాధ్యక్షురాలు కష్ణవేణి, సంగీత, నాగమ్మ, నళిని, అనురాధ మాట్లాడుతూ 10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, మెడికల్‌ లీవులు,పెన్షన్లు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు సీఐటీయూ జిల్లా నాయకులు చల్లా వెంకటయ్య మాట్లాడుతూ ఆశా ల కు ప్రమాదం జరిగితే పట్టించుకొనే వారే లేరని, వారంలో రోజుకు ఒక పని ఉండేవిధంగా ప్రభుత్వం నిర్ణయించి 24 గంటలు పని చేయించు కొంటున్నదని ఆరోపించారు.