Oct 14,2023 20:34

మాట్లాడుతున్న మాజీ మంత్రి నారాయణ

మాట్లాడుతున్న మాజీ మంత్రి నారాయణ
2024లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుదాం
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:నెల్లూరు నగరంలోని గోమతి క్యాంప్‌ కార్యాలయంలో 5,8,15,40 డివిజన్ల పార్టీ నాయకులతో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడుకి ప్రపంచమంతా తోడుగా ఉందని... త్వరలోనే బయటకు వస్తారన్నారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. 2024 లో గెలుపే లక్ష్యంగా ముందడుగు వేయాలన్నారు.
. వైసీపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి చంద్రన్నను గెలిపించుకోవాలని సూచించారు. ప్రధానంగా దొంగ ఓట్లపై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు.