ప్రజాశక్తి - ఎస్‌ఆర్ పురం : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ముక్కల్తూరు గ్రామంలో నుంచి బంగారుపేటకు అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల రేషన్ బియాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఈ రేషన్ బియ్యాన్ని తమిళనాడుకు తరలిస్తుండగా ముష్టిపల్లి వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. మూడు వాహనాలను, బియ్యాన్ని గంగాధర నెల్లూరు ప్రభుత్వ గోడౌన్‌కు తరలించి సీజ్ చేశామని తెలిపారు.










