Mar 15,2022 22:29

పట్టుబడ్డ దుంగలను చూపుతున్న ఎస్పి సుందరరావు



మరో కేసులో ఇద్దరు చొరబాటు దారులు పట్టివేత
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
చంద్రగిరి మండలం చామల రెంజ్‌ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఇద్దరు చొరపాటు దారులను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్‌ పర్యవేక్షణలో ఆర్‌ఐ సురేష్‌ కుమార్‌రెడ్డి బృందం లోని ఆర్‌ఎస్‌ఐ లింగాధర్‌ బందం శేషాచలం అడవుల్లో కూంబింగ్‌ చేపట్టింది. తెల్లవారుజామున అన్నదమ్ముల బండ వద్దకు చేరుకోగా అక్కడ కొంతమంది భుజాలపై ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించారని, వారిని చుట్టుముట్టేలోపు దుంగలు పడసి పారి పోయారన్నారు. పారిపోతున్న వారిలో ఒకరిని పట్టుకోగలిగామని, ఇతను తమిళనాడు తిరువన్నామలై జిల్లా జవ్వాది మలైకు చెందిన రామకష్ణ (30)గా గుర్తించామన్నారు. అక్కడ 20 ఎర్రచందనం దుంగలు లభించాయని, అవి సుమారు టన్ను బరువు ఉంటుందని, విలువ సుమారు 70 లక్షల రూపాయలు ఉండవచ్చని తెలిపారు. ఈ కేసును సిఐ చంద్రశేఖర్‌ దర్యాప్తు చేస్తున్నారన్నారు. అదే విధంగా చంద్రగిరి మండలం చామల రేంజ్‌ అటవీ ప్రాంతంలోకి చొరబడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసికొని వారి వద్ద నుండి గొడ్డలి, ఇతర బ్యాగులు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని తమిళనాడు కష్ణగిరి జిల్లాకు చెందిన రాజేంద్ర (35), పెరుమాళ్‌ (42)గా గుర్తించామన్నారు. ఈ కేసును ఎస్‌ఐ మోహన్‌నాయక్‌ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు డీఎస్పీ మురళీధర్‌, సిఐలు చంద్రశేఖర్‌, రామకష్ణ, ఆర్‌ఐ సురేషకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓలు ప్రసాద్‌, ప్రేమ, ఆర్‌ఎస్‌ఐ లింగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.