ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ టిడిపి మినీ మేనిఫెస్టో లోని భవిష్యత్తుకు గ్యారెంటీ అంశాల ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ల డానికి చేపట్టిన బస్సుయాత్ర వచ్చే నెల 1న అనంతపురం నియోజకవ ర్గంలోకి అడుగుపెట్టనున్నట్లు ఆ పార్టీ అర్భన్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి తెలిపారు. గురువారం అర్భన్ నియోజకవర్గం కార్యాలయంలో టిడిపి శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రి మినీ మహానా డులో ప్రకటించిన అంశాలను ఇంటింటికీ తెలియజేయాలన్నారు. టిడిపిని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బస్సుయాత్ర 1వ తేదీ ఉదయం 10.30 గంటలకు జెఎన్‌టియు రోడ్డులోని టిడ్కో ఇళ్ల వద్ద నుంచి ప్రారంభమై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, హౌసింగ్ బోర్డు, ఫెర్రర్ విగ్రహం, చెరువుకట్ట రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, గుత్తి రోడ్డు అన్న క్యాంటీన్, త్రివేణి, మరువంక, కల్లూరి సుబ్బారావు మ్యూజియం, పీస్ మెమో రియల్ హాల్, ఎన్టీఆర్ మ్యూజియం (కోర్టు రోడ్డు), మధ్యాహ్న భోజన విరా మం, అనంతరం టవర్ క్లాక్, ఎన్టీఆర్ విగ్రహం, ఎర్రనేల కొట్టాల, రాజీవ్‌కాల నీ వారధి, మరాఠీకాలనీ (రచ్చబండ) రాత్రి బస అక్కడే ఉంటుందన్నారు. ఈ యాత్రలో పెద్దఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయ ర్ గంపన్న, రాష్ట్ర కార్యదర్శులు దేవళ్ల మురళి, ఆదినారాయణ, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ స్వప్న, నగర మహిళా అధ్యక్షురాలు విజయశ్రీరెడ్డి, రాష్ట్ర మహిళా స్పోక్‌పర్సన్ సంగా తేజస్విణి, ననగర అధ్యక్షుడు మారుతీకుమార్ గౌడ్, పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు డిష్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి










