Oct 18,2023 19:52

మాట్లాడుతున్న అమర వైద్యశాల మేనేజర్‌ నరసింహరావు

మాట్లాడుతున్న అమర వైద్యశాల మేనేజర్‌ నరసింహరావు

18న పిడియాట్రిక్‌ ఆర్థోపెడిక్స్‌ నిపుణులు రాక
ప్రజాశక్తి-నెల్లూరు:ఈ నెల 18వ తేదిన తిరుపతికి చెందిన అమరా వైద్యశాలకు చెందిన పిడియాట్రిక్‌ ఆర్థోపెడిక్స్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ వి.దుర్గాప్రసాద్‌ విచ్చేస్తున్నారు. బుధవారం స్థానిక నక్కలవారి సెంటర్‌, బృందావనం ప్రాంతంలోని శ్రీ లలిత ఆర్థోకేర్‌ హాస్పిటల్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమర వైద్యశాల మేనేజర్‌ నరసింహరావు,లలిత ఆర్థోకేర్‌ వైద్యశాల వైద్యులు డాక్టర్‌ కె.శ్యాం ప్రసాద్‌ శశాంక్‌ మాట్లాడుతూ పుట్టుకతో అంగవైకల్యం, పాదాల వంకర, నరాల సంబంధింత వ్యాధులు సెరిబ్రల్‌ పాల్సీ, చిన్న పిల్లల్లో విరిగిన ఎముకల ఆపరేషన్‌, వంకరగా ఉన్న మోకాళ్లను సరిచేయడం తదితర అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న చిన్నారులకు ఈ వైద్యశిబిరంలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవసరమైన వారికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా అపరేషన్లు నిర్వహిస్తామన్నారు
. అంతే కాకుండా ప్రతి నెల మూడవ శుక్రవారం అమరా వైద్యశాలకు చెందిన పిడియాట్రిక్‌ ఆర్థోపెడిక్స్‌ వైద్యులు వి.దుర్గాప్రసాద్‌ విచ్చేసి వైద్యసేవలందిస్తారన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపు నిచ్చారు.