- జెడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి
ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం : ఎస్ఆర్ పురం మండలకి టిటిడి ద్వారా 18 నూతన ఆలయాలు మంజూరు అయిందని జెడ్పిటిసి ప్రసాద్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చొక్కామడుగు దిగువ ముద్ధి కుప్పం, సి.కె.పురం దాసరిగుంట పుల్లూరు ఎన్ ఆర్ పురం చిన్నతయురు పెద్ద తయ్యూరు ఒడ్డుపల్లి పిల్లిగుండ్లపల్లి డీకే మర్రిపల్లి వెంకటాపురం రాఘవరాజపురం మిట్ట హరిజనవాడ పొదలపల్లి క్షీరా సముద్రం, దిగువ ముంగుంట ఏయంపురం వడ్డిండ్లు ఈ గ్రామాలకు ఒక్కొక్క ఆలయానికి 10 లక్షలు మంజూరు అయిందని గ్రామస్తులు అందరు కలిసి ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సకాలంలో బిల్లులు అందుతాయని ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పిటిసి ప్రసాద్ రెడ్డి తెలిపారు అలాగే దాసరి గుంట క్షీరా సముద్రం దిగుమంగుంట పెద్ద తయ్యూరు గ్రామాల్లో నాలుగు ఆలయాలు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మణి, నాయకులు భూపతి రెడ్డి యుగంధర్ రెడ్డి ఆనంద్ రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు.










