చిత్తూరుఅర్బన్: ఈనెల 16వ తేది విజయదుర్గా కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చిత్తూరు జిల్లా మొదటి కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు శివయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పి సిఇఒ ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన అనంతరం మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ జిఇఏ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి ఆస్కారావు విచ్చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బాలాజీ రెడ్డి, చిత్తూరు తాలూకా కార్యదర్శి హరి ప్రసాద్ రెడ్డి, బంగారు పాల్యం తాలూకా కార్యదర్శి సురేంద్ర నాధ రెడ్డి, నరేష్ బాబు, తాలూకా ఉపాధ్యక్షులు శరత్ బాబు, రూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










