Oct 05,2023 20:15

మాట్లాడుతున్న రెవెన్యూ అధికారి

ప్రజాశక్తి-నెల్లూరు :హొహొ హొరాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి ఈవిఎం ఓటింగ్‌ యంత్రాల మొదటి దశ తనిఖీలు చేపడతామని జిల్లా రెవెన్యూ అధికారి సి. వెంకట నారాయణమ్మ తెలిపారు.గురువారం సాయంత్రం హొకలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌ లో ఓటరు జాబితా పునశ్ఛరణ, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో హొఆమె సమావేశం నిర్వహించారు. డిఆర్‌ఒ హొమాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన హొబ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వివి ప్యాట్లు హొమొదటి దశ తనిఖీలను ఈనెల 16వతేదీ నుంచి చేపట్టడం జరుగుతుందన్నారు. హొఆ సమయానికి రాజకీయపార్టీల ప్రతినిధులు రావాలని సూచించారు. ఈ నెల 27న సమీకత ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచరుణ జరుగుతుందన్నారు. హొఅక్టోబరు 27 నుంచి డిసెంబర్‌ హొ9వరకు స్వీకరించిన అభ్యంతరాలను డిశంబరు 26వ తేదీకల్లా పరిష్కరిస్తామన్నారు. టిడిపి ప్రతినిధులు ఉచ్చి భువనేశ్వర ప్రసాద్‌, బిజెపి ప్రతినిధులు శ్రీనివాస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రతినిధులు ధరణి కుమార్‌ పాల్గొన్నారు.హొ