Mar 08,2022 21:29

దుంగలను, స్మగ్లర్ల అరెస్టును చూపుతున్న పోలీసులు


ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
మరికొంతమంది స్మగ్లర్లు పారిపోగా వారి కోసం గాలింపు చేపట్టారు. రైల్వే కోడూరు ఆర్‌ఐ కపానంద టీమ్‌ సోమవారం నుంచి శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టింది. మంగళవారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు గుండ్రాళ్ళ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించగా వారిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చుట్టుముట్టారు. కొందరు దుంగలను పడవేసి పారిపోగా, ఇద్దరిని పట్టుకున్నామన్నారు. పట్టుబడ్డ స్మగ్లర్లు శ్రీకాళహస్తి మండలం కలువ కుంట గ్రామానికి చెందిన మించుల ఢిల్లీ బాబు (47), ఆంజనేయ పురానికి చెందిన పెముల సురేష్‌ (29) గా గుర్తించామన్నారు. ఈ కేసును సిఐ చంద్రశేఖర్‌ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో సిఐ రామకష్ణ, ఆర్‌ఎస్‌ఐ ఆలీబాషా తదితరులు పాల్గొన్నారు.