Sep 26,2023 22:08

15వ రోజుకు చేరిన డెయిరీ కార్మికుల దీక్షలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ విజయ సహకార డెయిరీ కార్మికులు చేస్తున్న రిలేదీక్షలు మంగళవారనికి 15వ రోజుకు చేరుకుంది. అమూల్‌ డెయిరీఎదుట సహకార విజయ డెయిరీ కార్మికుల దీక్షలు పోలీసులు భగం చేయడంతో కార్మికులు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు. తమకు కార్మిక చట్టాల ప్రకారం పాత వేతనబకాయిలు చెల్లించేంత వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని కార్మిక సంఘం నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని కోరారు.