May 18,2023 11:29

ప్రజాశక్తి-కనగానపల్లి :  కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ పోరంబోకు భూమిలో వేసిన చిన్న చిన్న షాపులను తొలగిస్తున్న క్రమంలో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. పోలీసుల సహకారంతో వైసీపీ వారి షాపులను వదిలేసి తెలుగుదేశం పార్టీ వారి షాపులను  తొలగించడంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.  ఈ నేపధ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.