కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతున్న జిల్లా ప్రన్సిపల్ జడ్జి
అనంతపురం కలెక్టరేట్ : మే 13న నిర్వహించనున్న లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరుతూ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు ఎమ్.గౌతమి, అరుణ్ బాబు, ఎస్పీలు కంచి శ్రీనివాసరావు, ఎస్‌వి.మాధవ్ రెడ్డి తదితరులతో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.శ్రీనివాస్ శుక్రవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అండర్ ట్రయల్స్‌గా ఉంటూ జైళ్లలో ఉంటున్న బాధితుల కేసులకు సంబంధించిన ఛార్జిషీటు త్వరగా ఫైల్ చేయాలని ఎస్పీలను కోరారు. ఈ సమావేశంలో అత్యాచారానికి గురైన ఓ బాధితురాలికి పరిహారంగా రూ.7 లక్షలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు.










