Mar 09,2022 21:45

మాట్లాడుతున్న డివైఎఫ్‌ఐ నేతలు



ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, ఉద్యోగుల వయో పరిమితిని 60కే పరిమితం చేయాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి జిఎస్‌ భవన్‌లో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఎఐఎస్‌ఎప్‌ జిల్లా కార్యదర్శి బండి చలపతి, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ అధ్యక్షులు కొట్టే హేమంత్‌, ఎఐవైఎఫ్‌ నగర అధ్యక్షులు రామక్రిష్ణ ఆధ్వర్యంలో ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. చర్చ జరగని పక్షంలో అసెంబ్లీ చివరి రోజు 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చారు. 12న జరిగే సబ్‌కలెక్టరేట్‌ ముట్టడికి జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.