Jun 10,2023 22:41

ప్రజాశక్తి - మొగల్తూరు
            ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తొలిరోజే జగనన్న విద్యా కానుక అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్టాక్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.రవిశంకర సర్కార్‌ శనివారం తెలిపారు. మొగల్తూరు మండలంలోని ప్రాథమిక పాఠశాలలు 68, ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ఉన్నత పాఠశాలలు పది ఉన్నాయన్నారు. గత విద్యా సంవత్సరం నుంచి కొనసాగుతున్న విద్యార్థులతో పాటు కొత్తగా చేరే విద్యార్థులను అంచనావేసి సుమారు 5400 మంది విద్యార్థులకు కిట్లను సిద్ధం చేశామన్నారు. మొగల్తూరు మండలానికి సంబంధించి మొగల్తూరులో స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేశారని, మండలంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అందించేందుకు నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బూట్లు, సాక్స్‌, బెల్ట్‌, బ్యాగ్‌, యూనిఫాంలను ఆయా పాఠశాలలకు చేరవేయడం దాదాపుగా పూర్తి చేశామన్నారు. ఈ నెల 12వ తేదీన సిఎం జగన్‌ జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయా పాఠశాలలో విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.