Mar 03,2022 20:23

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న న్యాయసేవా సదన్‌ జిల్లా కార్యదర్శి కరుణకుమార్‌.


ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
స్థానిక పాత కోర్టు ఆవరణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ పై పాత్రికేయులకు వివరిస్తూ ఎక్కువ కేసులను పరిష్కరించే విధంగా ఈ నెల 12 వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటివరకూ ఆరువేల కేసులను పైగా గుర్తించామన్నారు. కరోనా కారణంగా భౌతికదూరం పాటిస్తూనే కేసులను పరిష్కరించాలని కోరారు. ప్రత్యక్షంగానూ, వర్చువల్‌ విధానంలోనూ నిర్వహిస్తామన్నారు. మోటార్‌ వాహనాల ప్రమాదాలకు సంబంధించిన కేసులలో అర్జీదారులు అవగాహనతో ముందుకు రావాలని, నోటీసులు వచ్చినా రాకపోయినా ఇరుపక్షాల ప్రతివాదులు వచ్చి లోక్‌ అదాలత్‌ ద్వారా తమ సమస్యలకు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.