Oct 06,2022 22:28

12 నుంచి యువ్‌ ఉత్సవ్‌ ప్రారంభం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2022-23లో యువ్‌ఉత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించిందని ఇందులో యువతలోని సజనాత్మక నైపుణ్యాలను పెంపొందించేలా పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌, నెహ్రు యువకేంద్ర కో-ఆర్డినేటర్‌ ప్రదీప్‌ను ఆదేశించారు. గురువారం డిఆర్‌ఓ ఛాంబర్‌లో ఈనెల 12న పివికెఎన్‌ డిగ్రీకళాశాలలో జిల్లాస్థాయిలో యువ్‌ఉత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమత్‌ మహోత్సవ్‌ 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వశాఖ యువ్‌ఉత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని, ఈకార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు నెహ్రు యువ కేంద్ర కో-ఆర్డినేటర్‌తో పాటు సంబంధిత శాఖలైన ఐఅండ్‌ పిఆర్‌ డిడి పద్మజ, గురజాడ ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ హరికష్ణారెడ్డి, సెట్విన్‌ సిఈఓ కార్యాలయం నుండి రాజశేఖర్‌, తిరుపతి మాస్‌ ఎన్‌జిఓ ప్రెసిడెంట్‌ గుణశేఖర్‌ రెడ్డి, ప్రభుత్వ పివికెఎన్‌ డిగ్రీ కళాశాలకు చెందిన డాక్టర్‌ భానుప్రకాష్‌, ఎన్‌ఎస్‌ఎస్‌పిఓ డాక్టర్‌ ఎన్‌.రామమూర్తి, నెహ్రుయువ కేంద్ర అకౌంట్స్‌ ఆఫీసర్‌ బాబురెడ్డిలతో సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమ విజయవంతానికి యువతను భాగస్వామ్యం చేస్తూ వారిని పెయింటింగ్‌, కవితా పోటీలు, ఫోటోగ్రఫీ (మొబైల్‌), ఉపన్యాస పోటీలు, సాంస్కతిక వేడుకలు (బంద నత్య పోటీలు), యువ సమిద్‌ ఇండియా 2047 కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే యువ్‌ ఉత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల రిజిస్ట్రేషన్‌, మంత్రివర్యులు, ఎంపిలు, ఎంఎల్‌ఏలు, మేయర్లు, సెలబ్రిటీలు కార్యక్రమంలో పాల్గొనేలా కార్యక్రమ నిర్వహణ చేపట్టాలని, కోవిడ్‌ నియమ నిబంధనలు తప్పనిసరి పాటించాలని సూచించారు. జిల్లాస్థాయి పోటీలలో గెలుపొందిన మొదటి విజేతలను రాష్ట్రస్థాయిలో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని, రాష్ట్రస్థాయిలో విజేతలైన వారు జాతీయస్థాయిలో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను డిఆర్‌ఓ, ఇతర సంబంధిత అధికారు లు ఆవిష్కరించారు.