Sep 23,2023 22:02

11వ రోజుకు చేరిన డెయిరీ కార్మికుల దీక్షలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: పెండింగ్‌ వేతనాలు చెల్లించాలంటూ సహకార విజయ డెయిరీ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. అమూల్‌ ఆవరణంలో దీక్షలను భగం చేయడంతో కార్మికులు అమలు డెయిరీ ఎదుట రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. తమ సమస్యలను పరిష్కరించి పెండింగ్‌ వేతనాలు చెల్లించేంతవరకు రిలే దీక్షలను కొనసాగిస్తామని విజయ సహకార డెయిరీ కార్మికుల యూనియన్‌ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ చర్చలకు ఆహ్వానించి తమ పెండింగ్‌ వేతనాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.