ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి గణపవరం డిగ్రీ కాలేజీలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీ ప్రిన్సిపాల్ పి.నిర్మలకుమారి మాట్లాడుతూ.. 1977లో జనతా పార్టీ పాలనలో బాబు జగన్ జీవన్ రామ్ దేశానికి డిప్యూటి ప్రదానమంత్రిగాసేవలందించారని అన్నారు దీంతోపాటు వర్దమానమహవీరుని 2483 వజయంతికూడా నిర్వహాంచారు. వర్దమాన మహావీరుడు జైనమత.అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తని అన్నారు. ఈకార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ పి.మధురాజు, లెక్చరర్లు టి.అక్కిరాజు, కె.స్వరూపరాణి, ఎన్.ఎస్.బి.శ్రీనివాస్, సిఎచ్చ్.చైతన్య, బి.రమేష్ కుమార్, డివివి చిన్న సత్యనారాయణ పాల్గొన్నారు.










