Aug 01,2022 21:40

1,127 మందికి పింఛన్లు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ :
నగరపాలక సంస్థ పరిధిలో కొత్తగా 1,127 మందికి పింఛన్లు మంజూరు అయినట్లు నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు వైయస్సార్‌ పెన్షన్‌ కానుక సొమ్ములను వాలంటీర్లు ఉదయం 5గంటల నుంచి పంపిణీ చేశారు. మొదటిరోజు నగరపాలక సంస్థ పరిధిలో 89శాతం పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. మొత్తం 17,159 పింఛన్లకు గాను 15,193 పింఛన్లు పంపిణీ పూర్తిచేసినట్లు వివరించారు. మిగిలిన పింఛన్లను వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందించాలని కమిషనర్‌ వార్డు కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం 39వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర మేయర్‌ ఎస్‌.అముద కొత్తగా మంజూరైన వైయస్సార్‌ పెన్షన్‌ కానుకను లబ్ధిదారులకు అందించారు. కొత్తగా మంజూరైన పింఛన్లను నగరంలోని అన్నివార్డుల్లో స్థానిక కార్పొరేటర్లు, ఇతర ప్రముఖులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.