ప్రజాశక్తి-పాలకొల్లు : పోడూరు మండలం కవిటంకు చెందిన అంబళ్ళ మహాలక్ష్మీ కి రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఐ-సెట్ లో 10వ ర్యాంకు సాధించింది. గత ఏడాది కూడా 38 వ ర్యాంకు వచ్చింది. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో ఆమె ఎంబిఎలో చేరలేదు. 4 నెలలు ఉద్యోగం చేసిన మనస్సు ఎంబిఎ చేయాలని కోరుకోవడంతో తిరిగి ప్రిపేర్ అయి ఈసారి 10వ ర్యాంకు సాధించింది.తల్లి శ్యామల దేవి.తండ్రి సత్యకుమార్ ఎన్సిసి సంస్థలో ప్రైవేటు ఇంజనీర్ గా పనిచేసారు. దీనితో ఆమె చిన్నతనంలో పలు పాఠశాలల్లో విద్యాభ్యాసం చేయవలసి వచ్చింది. 1,2,3 తరగతులు హైదరాబాద్, కడప,4,5 తరగతులు కవిటం, 6 వ తరగతి తాళ్ళపూడి, 7 నుంచి 10 వరకు నెల్లూరులో చదివింది. ఇంటర్, డిగ్రీ పాలకొల్లులోని ఆదిత్య కళాశాలలో చదివింది.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని..
ప్రస్తుతం తాను మంచి కళాశాలలో ఎంబిఎ చేస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసి ఇన్ కం టాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తన చెల్లెలు బిటెక్ చదివి పోస్ట్ మాస్టర్ గా పేరుపాలెంలో పనిచేస్తోందని, తమ్ముడు 9వ తరగతి చదువుతున్నట్లు చెప్పారు. తనకు తాతయ్య భాస్కరరావు, అమ్మమ్మ అప్పాయమ్మ (మాజీ సర్పంచ్) స్ఫూర్తి అని చెప్పారు.










