Jul 06,2023 10:24

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పలకు నూతన 108 వాహనం మంజూరు కావడంతో నార్పల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన 108 వాహనాన్ని ప్రభుత్వ 108 జిల్లా అధికారులు108 డిస్టిక్ మేనేజర్ సంజీవరెడ్డి ,డిస్టిక్ డి ఎఫ్ ఎం యుగేందర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 నూతన 108 వాహనాలను మంజూరు చేశారు. ఇందులో భాగంగా నార్పలకు కూడా నూతన వాహనం మంజూరు అయిందని మండలానికి నూతన వాహనం రావడం పట్ల అత్యవసర వైద్య సేవలు సత్వరంగా అందుతాయని పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనంతపూర్ జిల్లా 108 డిస్టిక్ మేనేజర్ సంజీవరెడ్డి ,డిస్టిక్ డి ఎఫ్ ఎం యుగేందర్,  నార్పల ప్రాథమిక వైద్యశాల వైద్యులు  సాదియా, ప్రవీణ్  నార్పల 108 స్టాప్ టెక్నీషియన్ విజయ్, యుగేందర్ , పైలెట్,రాజశేఖర్ ఎస్సీ సెల్ రామయ్య సూపర్వైజర్ అక్కులప్ప రామలింగ తదితరులు పాల్గొన్నారు.