May 12,2023 11:26

రాయదుర్గం (అనంతపురం) : కరెంటు షాక్‌ తగిలి 10 గొర్రెలు మృతి చెందిన ఘటన శుక్రవారం రాయదుర్గంలో జరిగింది. రాయదుర్గం పట్టణం వాల్మీకినగర్‌ కు చెందిన నాయకుల తిప్పేస్వామికి చెందిన 10 గొర్రెలు ఈరోజు ఉదయం కరెంటు షాక్‌ తగిలి మృతి చెందాయి. గొర్రెలు ఉంచిన పాక చుట్టూ ఇనుప తీగ కంచె ఉండగా విద్యుత్‌ తీగలు కంచె పై పడటంతో కంచెకు విద్యుత్‌ సరఫరా అయ్యింది. దీంతో గొర్రెలకు కరెంటు షాక్‌ తగిలి మృతి చెందినట్లు తిప్పేస్వామి తెలిపారు. లక్ష రూపాయలు ఆస్తి నష్టం సంభవించిందని వాపోయారు.