May 15,2023 14:48

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి శివశంకర మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షాలు జిల్లాలో అధిక వర్షాలు వీధి గాలులు వడగండ్లు వర్షంపంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఆత్మహత్య చేసుకున్న రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మార్చి నెలలో జిల్లాలో  వీచిన భారీ గాలులు వడగండ్ల వాన వివిధ రకరకాల పంటలు లక్షల హెక్టర్లులో రకాల పంటలు నష్టపోయిన అరటి మొక్కజొన్న టమోటా బత్తాయి దానిమ్మ బొప్పాయి కరేపాకు పంటలు అసాధారణంగా దెబ్బ తినడం జరిగిందన్నారు. మరొకసారి కురిసిన వర్షాల వల్ల చేతికొచ్చిన పంటను అరటి శీను బత్తాయి తమలపాకు పంటలతో పాటు మిరప పంట పూర్తిగా 2022 సంవత్సరానికి సంబంధించి వేరుశెనగ కంది జొన్న ఇతర పంటలన్నీ నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు 50 వేల నుండి 30 వేల దాకా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. రైతులు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రతి సంవత్సరము నష్టపోవడం జరుగుతుందికౌలు రైతుకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని జిల్లాలో వలస ఆపాలని వెంటనే స్పందించి పంటలు నష్టపరిహారం ఇన్సూరెన్స్ రానున్న పంటలకు పెట్టుబడి ఇప్పుడు సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు ఎం రామయ్య,  లింగన్న, రైతు సంఘం రాము, జయలక్ష్మి, పరమేష్, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.