ప్రజాశక్తి - నెల్లిమర్ల : వైసిపి నాయకుల అండతో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ముఖ్యంగా చంపావతి నది పరివాహక ప్రాంతాలు జరజాపు పేట, మొయిద కాజ్‌వే, రామతీర్థం కాజ్‌వే, జ్యూట్ మిల్లు సమీపంలో వంతెన, కుదిపి నీలంరాజుపేట సమీపంలో ఇసుక తవ్వకాలు జరిపి ట్రాక్టర్లు, నాటు బల్లు, ద్వి చక్ర వాహనాల ద్వారా తరలించి వేరే ప్రాం తాల్లో డంప్ చేసి రాత్రుళ్ళు లారీల ద్వారా తరలిస్తు న్నారు. మిల్లు బ్రిడ్జి వద్ద నీటి పథకాల వద్ద కూడా మిని ఆటోలు, ఏడ్లు బళ్ళు ద్వారా ఇష్టానుసారంగా రవాణా జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినవస్తు న్నాయి. గుడి నిర్మాణాలు పేరిట ఇసుక అక్రమంగా తరలించి వేలాది రూపాయలు అక్రమార్జన చేస్తున్నారని సమాచారం. మంచి నీటి పథకాల వద్ద కూడా ఇసుక తవ్వకాలు జరపడంతో తాగునీరు రంగు మారి బురదనీరు సరఫరా అవుతుందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటు బండ్లు, ఆటోల ద్వారా ఇసుకను నిల్వ చేసి రాత్రి వేళల్లో లారీల ద్వారా అమ్మకాలు జరిపి అక్రమార్కులు వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. వైసిపి నాయకుల అండదండలతో ఇసుక దందా జరుగుతున్నట్లు సమాచారం. ఇంత జరుగుతన్నా ఇసుక అక్రమ రవాణాపై అధికార యంత్రాంగం మాకెందుకులే అన్నట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు చర్చించుక ుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని కొంత మంది వ్యక్తులు అధికారులకు ఫిర్యాదు చేసినా సరే పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకొని మంచి నీటి పథకాలను పరిరక్షించాలని కోరుతున్నారు.










