ప్రజాశక్తి - రంపచోడవరం
రంపచోడవరం మండలంలో కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ టిడిపి రంపచోడవరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి వంతల రాజేశ్వరి ఆధ్వర్యాన బుధవారం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలపై భారాలో మోపుతూ ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం అన్నం పెట్టే రైతన్నలను ఇబ్బంది పెడితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. వెంటనే కల్లాల్లో తడిసిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కారం సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి పెంటపాటి అనంత మోహన్, నాయకులు గొర్లె సునీత, దిండి జనార్ధన్, బొడ్డేటి వీరబాబు, చక్రపాణి, కొమరం రామన్న దొర, బాబ్జి, సాధన సత్యవతి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










