Aug 26,2023 19:57

శిథిలావస్థకు చేరిన వాణిజ్య సముదాయం భవనాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ శ్రీరాములునాయుడు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  చిన్న, మధ్య తరహా పట్టణాల సమగ్ర అభివృద్ధి వ్యాపార సముదాయ భవనానికి పాక్షిక మరమ్మతులు చేపట్టి మరింతగా ప్రజా వినియోగంలోకి తీసుకు రానున్నట్లు కమిషనర్‌ ఆర్‌.శ్రీరాములు నాయుడు వెల్లడించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో ఉన్న ఐడిఎస్‌ఎంటి షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఆయన పరిశీలించారు. ఇటీవల వ్యాపార సముదాయ భవనం దక్షిణ భాగంలో చిన్నపాటి గోడ కూలడంతో వ్యాపారస్తుల అభ్యర్థన మేరకు తక్షణ మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌, ఇతర అధికారులతో కలిసి కమిషనర్‌ వ్యాపార సముదాయం పై అంతస్తు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం స్లాబు పనులు పూర్తి స్థాయిలో చేపట్టేందుకు నిర్ణయిం చారు. అవసరమైన అంచనా వ్యయం సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశించారు.నగర నడిబొడ్డులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వ్యాపార సముదాయం ఏర్పాటు కావడం వల్ల ఎంతోమందికి ప్రయోజనం చేకూరు తుందన్నారు. వ్యాపార సముదాయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మరింతగా ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. రెవెన్యూ, హెల్త్‌ కమిటీ సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఐడియస్‌ ఎంటి కాంప్లెక్స్‌ భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపే ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు. తద్వారా కమిటీ ఇచ్చిన సూచనలతో భవన సముదా యాన్ని ఆధునీకరిస్తా మన్నారు. సమన్వయ కమిటీ నిర్ణయాన్ని కౌన్సిల్‌ దష్టికి తీసుకురానున్నట్లు చెప్పారు. సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, ఇఇ కె. శ్రీనివాసరావు, డిఇ పాల్గొన్నారు.