ప్రజాశక్తి - నెల్లిమర్ల : విద్యుత్ పోరాట అమర వీరులను స్మరించుకోవాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కిల్లంపల్లి రామారావు అన్నారు. సోమవారం స్థానిక విద్యుత్ జిల్లా స్టోర్స్ వద్ద హమాలీ సంఘం ఆధ్వర్యంలో 2004 విద్యుత్ పోరాట అమర వీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ అమర వీరుల చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామారావు మాట్లాడుతూ 2004లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ పోరాటం చేసి అమరులైన వీరులను స్మరించుకోవడం గర్వంగా ఉందన్నారు. వారు విద్యుత్ పోరాటంలో అమరులై 19 సంవత్సరాలు గడుస్తున్నా వారి త్యాగాన్ని మరువలేమన్నారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు అధికంగా పెంచడం మరోసారి విద్యుత్ ఉద్యమానికి ప్రోత్సహించడమే నన్నారు. విద్యుత్ పోరాట అమర వీరుల త్యాగాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అమలులో భాగంగా పెంచుతున్న విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పోరాటాలు, ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు పతివాడ లక్ష్మణ రావు, కెళ్ళ గోవింద రావు, పతివాడ పెద రాంబాబు, చిన రాంబాబు, మీసాల లెనిన్, తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస: విద్యుత్ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులకు కొత్తవలస సిపిఎం పార్టీ కార్యాలయం ఘనంగా నివాళులు అర్పించింది. అప్పటి టిడిపి గవర్నమెంట్ విద్యత్ ఉద్యమ కారులపై నిర్థ్యక్షాన్యంగా కాల్పులు జర్పిందని సిపిఎం నాయకులు గాడి అప్పారావు అన్నారు. ఈ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమం మహేష్, రమణ, హర్ష, నాయుడు తదితరులు పాల్గొని నివాళ్లు అర్పించారు.










