ప్రజాశక్తి- శృంగవరపుకోట: టిడిపి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని జిల్లా వైసిపి సోషల్ మీడియా కన్వీనర్ మామిడి శంకరరావు ఆరోపించారు. ఈ సందర్బంగా శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లడుతూ నారా లోకేష్ పాదయాత్రలో మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు ఏ కార్యకర్త మీద ఎక్కువ పోలీస్ కేసులు ఉంటాయో వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలా, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే విధంగా ప్రసంగిస్తున్నారన్నారు. అందులో భాగంగా తంబళ్లపల్లి పులగునున్, మాచర్ల లాంటి సెన్సిటివ్ నియోజకవర్గాలలో గొడవలు చేస్తున్నారని, రానున్న రోజుల్లో ఇది ఇంకా ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యకుడు అచ్చంనాయుడులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
డెంకాడ: చంద్రబాబు, లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి కార్యకర్తలన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని భోగాపురం, డెంకాడ మండలాల్లో వైసిపి సోషల్ మీడియా విభాగం సభ్యులు శనివారం భోగాపురంలో ఎఎస్‌కు, డెంకాడలో ఎస్‌ఐ మహేష్‌కు వినతి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి సోషల్ మీడియా కో కన్వీనర్ బాకీ వెంకటకనకరావు భోగాపురం మండల సోషల్ మీడియా కన్వీనర్ శీరపు వంశీ రెడ్డి, కో-కన్వీనర్లు అవ్వ సూర్యనారాయణ, ఇప్పిలి గోవింద్, పిన్నింటి సూరిబాబు, నియోజకవర్గం సోషల్ మీడియా కో కన్వీనర్ కోరాడ అప్పన్న, డెంకాడ మండల సోషల్ మీడియా కన్వీనర్ పాల్గొన్నారు.
చీపురపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు తగు చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ ప్రభాత్ కుమార్, చీపురుపల్లి మండల సోషల్ మీడియా కన్వీనర్ మొండేటి కిషోర్, కో కన్వీనర్లు గురాన జనార్దన్, పేకాపు ప్రసాద్, బైరెడ్డి కామేష్, రామలింగపురం సచివాలయ సోషల్ మీడియా కన్వీనర్ రౌతు భాస్కర్ చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు.










