ప్రజాశక్తి- గరివిడి : వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లి పట్టణంలోని శివాలయం వీధి, డైలీ మార్కెట్లో మహాశక్తి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబునాయుడు పొందుపరిచిన అంశాలను ఇంటింటికి వెళ్లి నాగార్జున, పార్టీ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రజలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. వైసిపి విధానాలతో నిరుద్యోగులు, రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా వైసిపి ప్రభుత్వాన్ని ఎంత వేగంగా బంగాళాఖాతంలో కలిపేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో అన్ని ఎమ్మెల్యేలు, ఎంపి స్థానాన్ని టిడిపి అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రౌతు కాము నాయుడు, దన్నాన రామచంద్రుడు, రౌతు కాంతమ్మ, ఆరతి సాహూ, రామ చంద్ర సాహు, లెంక రాధ, పిల్లా కృష్ణవేణి, ముల్లు రమణ, దన్నాన సూరపనాయుడు, సనపతి శ్రీనివాస రావు, గవిడి నాగరాజు, రెడ్డి లక్ష్మణరావు, సబ్బి సోనియా, లెంక లక్ష్మణరావు, మీసాల కాశీ, వెంపడాపు లక్ష్మనాయుడు, శ్రీధర్ నాయుడు, కోరాడ కోటేశ్వరరావు, మోపాడ తెజేశ్వరరావు, సప్ప సూరప్పడు, గడే సన్యాసప్పల నాయుడు, గంట్యాడ సత్యనారాయణ, బుంగ మహేష్, పైల త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వైసిపి పాలన
రామభద్రపురం: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వైసిపి ప్రభుత్వ పాలన ఉందనీ రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వ పాలనకు ప్రజలు చరమ గీతం పలకడం తథ్యమని బొబ్బిలి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి బేబీనాయన అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రజలతో నేరుగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లకు నిధులు, విధులు కల్పించకుండా హక్కులను కాలరాస్తుందని, రాజ్యాంగంలో పొందుపరచిన వారి హక్కులకు భంగం కలిగిస్తూ వాలంటీర్లు ద్వారా నేరుగా కార్యక్రమాలు జరిపించడం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన సర్పంచులను అవమానించడమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 14,15 ఆర్ధిక సంఘం నిధులను పంచాయతీ ఖాతాలకు జమ చేస్తున్నా, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖాతాలోకి మార్చుకుని స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు చేసిన పనులకు మల్లిస్తున్నారని దుయ్యబట్టారు. గడపగడపకు ప్రభుత్వం పేరిట అదే ఎమ్మెల్యేలను ఇంటింటికి తిప్పుతూ వారు ఆమోదించిన పనులు మాత్రమే మంజూరు చేస్తూ గ్రామ ప్రథమ పౌరులను డమ్మీలను చేసారని ఆవేదన చెందారు. ఉపాధి హామీ పథకం నిధులతో చేస్తున్న పనులకు కూడా పంచాయతీ తీర్మానాలు అవుసరం లేదని తమ స్వంత కార్యకర్తలకు పనులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం కొట్టక్కి జాతీయ రహదారి నుండి వెళ్లే రహదారి పరిశీలించి మాట్లాడారు. ఈ రోడ్డు నరకాన్ని తలపించే విధంగా ఉందని, ఇటీవలే నిర్మించిన రహదారి కొద్ది రోజులకే ఇలా పాడవడం ఈ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అవినీతికి నిదర్శ నమన్నారు. వెంటనే కొట్టక్కి గ్రామ చెరువుకు రక్షణ గోడ నిర్మించాలని, పోత మట్టివలన దిగబడిపోతున్న మట్టి తీసివేసి, వెంటనే కంకర వేయాలని డిమాండ్ చేశారు. ఆ రహదారి మార్గంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ణప్తి చేశారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, స్థానిక మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ చింతల రామకృష్ణ, సర్పంచ్ రవ్వా ఈశ్వరరావు, ఎంపి టిసి వసంతుల తిరుపతి, మండల పార్టీ అధ్యక్షులు కరణం విజయభాస్కర్, ఉపా ధ్యక్షులు సిరిపురపు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చింతల చిన్నమ్మతల్లి తదితరులు పాల్గొన్నారు.










