May 10,2023 23:03

కాంతార నృత్యం చేస్తున్న కళాకారులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
మండలంలోని తంటికొండ పంచాయితీ పరిధి వట్టిగడ్డలో గ్రామ దేవత పట్టాలమ్మ తల్లి జాతర మహోత్సవం కులమతాలకతీతంగా వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు ఈ పండగ నిర్వహించారు. గ్రామస్తులంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ శివారున ఉన్న పట్టాలమ్మ తల్లి గుడివద్ద మంగళవారం రాత్రి నిర్వహించిన కాంతార, ఆఘోర వేషాలు, కోలాటం, గరగలు నృత్యాలు, శక్తి వేషాలు, థింసా నృత్యం, హైదరాబాద్‌ వారిచే డిజె కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామ సర్పంచ్‌ ఆగురి సుబ్బలక్ష్మి రమణ, ఉప సర్పంచ్‌ పల్లి వెంకటరమణ ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.