Sep 02,2023 18:52

నెంబరు ప్లేట్లు సరిగా లేని బైక్‌లను నిలిపివేసిన పోలీసులు

ప్రజాశక్తి-విజయనగరం :  వాహనాలకు అస్తవ్యస్థమైన నంబరు ప్లేట్‌ ఉంటే చర్యలు తప్పవని ట్రాఫిక్‌ డిఎస్‌పి డి,విశ్వనాధ్‌ హెచ్చరించారు. శనివారం నగరంలోని పలుచోట్ల ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఆర్‌టిసి కాంప్లెక్సు, కోట జంక్షన్‌, దాసన్నపేట రైతు బజారు వద్ద ట్రాఫిక్‌ ఎస్‌ఐలు లోవరాజు, ఎ.ఎం. రాజు వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలకు గల ఆస్తవ్యస్థమైన నంబరు ప్లేట్లు గుర్తించి, ఆయా నంబరు ప్లేట్లు తయారు చేయించి, ఆయా వాహనాలకు తిరిగి అమర్చారు. ఈ తనిఖీల్లో సుమారు 60 ద్విచక్ర వాహనాలకు అస్తవ్యస్థమైన నంబరు ప్లేట్లను తొలగించారు. ఎంవి నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు ఈ-చలానాలను విధించారు.