ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పూనుకుంటుందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం వల్లే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు వేయడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త కోర్కెలు కోరిన ఉద్యోగులు వైసిపి హయాంలో పాత వేతనాలు సకాలంలో ఇస్తే చాలని అంటున్నారని చెప్పారు. ఉపాధ్యాయు లను ప్రవీణ్ ప్రకాశ్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విద్యా రంగంలో మంచి ఫలితాలు సాధించారని, నేడు ప్రవీణ్ ప్రకాశ్ వేధింపులతో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవు తున్నారని తెలిపారు. కెజిబివిలో పని చేస్తున్న పాత ఉపాధ్యాయులను తొలగించి నూతనంగా నియమించడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు.
రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పింఛన్లు ఇవ్వాలి
రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పింఛన్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పిం3óన్లు ఇవ్వకపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రౌతు రామమూర్తి మాట్లాడుతూ ప్రతినెలా ఒకటో తేదికి పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వాలన్నారు. సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కర్రి సత్యనారాయణ, సభ్యులు పి.సత్యంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.










