Sep 01,2023 22:16

సీతానగరం : లక్ష్మీపురంలో ర్యాలీ చేస్తున్న టిడిపి నాయకులు విజయచంద్ర, జగదీష్‌

ప్రజాశక్తి - కురుపాం :  చంద్రబాబు తోనే మహిళలకు, రైతులకు, యువతకు న్యాయం జరుగుతూ ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి. జగదీశ్వరి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన కురుపాంలో చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంపై ఇంటింటికి వెళ్లి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కెవి కొండయ్య, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ సుకేష్‌ చంద్ర పండా, నాయకులు ఆకుల రమేష్‌, గుర్రాల గవరయ్య, సీర త్రినాథ తదితరులు పాల్గొన్నారు .
గరుగుబిల్లి : మండలంలోని గిజబలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జ్‌ తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు అక్కేన మధుసూదన్‌ రావు, ఎంపిటిసి సభ్యులు ఎం.సింహాచలం, మాజీ సర్పంచ్‌ ఎం.కృష్ణంనాయుడు, ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని దిగువమండలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి, జనరల్‌ సెక్రెటరీ పోలూరు శ్రీను, అరకు పార్లమెంటు కార్యదర్శి తాడంగి రామారావు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని లక్ష్మీపురంలో శుక్రవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి ర్యాలీ నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌, నియోజకవర్గ ఇన్చార్జి బోనాల విజయచంద్ర మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టిడిపి పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడును సిఎం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ద్వారపరెడ్డి శ్రీదేవి, మండల అధ్యక్షులు కొల్లి తిరుపతిరావు, మండల కమిటీ నాయకులు సాల హరిగోపాలరావు, సబ్బన్న శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, పార్టీ నాయకులు వి.గొంపస్వామి, యోగిరెడ్డి భాస్కరరావు, దాసరి సింహాచలం, గ్రామ కమిటీ నాయకులు సప్ప సుధాకర్‌, గవర భాస్కరరావు, పువ్వుల బాల గౌరీశ్వరరావు, చంద్ర ఉమామహేశ్వరరావు, చప్ప సింహాచలం, అల్లు శ్రీనివాసరావుతో పాటు 40 కుటుంబాల వరకు తెలిపి పార్టీలో చేరికలు జరిగాయి.