Sep 11,2023 21:30

ఎస్‌కోట: ధర్నాను భగం చేస్తున్న పోలీసులు

టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం టిడిపి నాయకులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ బంద్‌, నిరసన కార్యక్రమాల్లో జనసేన నాయకులు పాల్గొని సంఘీబావం తెలిపారు.
ప్రజాశక్తి- నెల్లిమర్ల : 
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని టిడిపి, జనసేన నెల్లిమర్ల నియోజకవర్గ ఇంచార్జిలు కర్రోతు బంగార్రాజు, లోకం నాగ మాధవి ధ్వజమెత్తారు. సోమ వారం నియోజకవర్గ కేంద్రంలో బంద్‌ నిర్వహించారు. ముందుగా స్థానిక నెల్లిమర్ల జూట్‌ మిల్లును మూసివేయించారు. విద్యాసంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలను బంద్‌ చేయించారు. మద్యం గోదామును మూసివేయించారు. కార్యక్రమంలో సువ్వాడ రవిశేఖర్‌, కడగల ఆనంద్‌ కుమార్‌, గేదెల రాజారావు లెంక అప్పలనాయుడు, పోతల రాజప్పన్న, అవనాపు సత్యనారాయణ, గురాన అసిరి నాయుడు, చందక చిన్నం నాయుడు, కింతాడ కళావతి, బైరెడ్డి లీలావతి, మహంతి శ్రీహరి పాల్గొన్నారు. డెంకాడ : మండల కేంద్రంలో మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సోమవారం తెలుగు దేశం నాయకులు రోడ్డుపై బైటాయించి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పాఠశాలలు, షాప్‌లు మూయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కంది చంద్రశేఖర్‌తో పాటు పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పల్లె భాస్కర్‌ రావు, నాయకులు కలిదిండి పాణీరాజు, కొయనేని రమణ, కొర్నాన ఆదిబాబు, కలిదిండి రంగరాజు, చలుమూరి మహేశ్‌, జనసేన డెంకాడ మండలం అధ్యక్షులు పతివాడ కృష్ణవేణి పాల్గొన్నారు. వేపాడ టిడిపి మండల అధ్యక్షుడు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టిడిపి మహిళా అధ్యక్షులు గుమ్మడి భారతి, మండల ఐటిడిపి అధ్యక్షుడు సేనాపతి గణేష్‌, నాయకులు జనపరెడ్డి ఈశ్వరరావు, సిరికి రమణ, గొర్ల నాగరాజు, వై సూర్యం, జగన్‌, రమణ ఎస్‌ అప్పారావు, అర్జున పాల్గొన్నారు. రామభద్రపురం మండల కేంద్రంలో టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రహదారిపై బైటాయించి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, మద్యం దుకాణాలు మూసి వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రవ్వా ఈశ్వర రావు, టిడిపి మండల అధ్యక్షులు విజయ భాస్కరరావు, చింతల చిన్నమ్మ తల్లి, రామారావు, రామి నాయుడు పాల్గొన్నారు. బొండపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మండల పరిషత్‌ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామీణ, స్టేట్‌ బ్యాంక్‌ మూతబడ్డాయి. కిరాణా, పాన్‌ షాప్‌ లను పలువురు వ్యాపారస్తులు స్వఛ్చందంగా మూసి వేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాలను టిడిపి శ్రేణులు మూసి వేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి బండారు బాలాజీ, నాయకులు పైల శ్రీనువాసరావు, జంపన సూరిబాబు, పాల్గొన్నారు. గుర్ల మండల కేంద్రంలో సోమవారం టిడిపి నాయకులు ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్‌కి అంతరాయం కలగడంతో ఎస్‌ఐ హరి బాబు నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని ధర్నాలో పాల్గొన్నావారిని చెదరగొట్టి ట్రాఫిక్‌ను నియంత్రిం చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటేశ్వర రావు, సోషల్‌ మీడియా నియోజకవర్గం కన్వీనర్‌ నారాయణరావు పాల్గొన్నారు. బాడంగి మండలంలోని ఎరుకల పాకలు గ్రామంలో ఎంపిటిసి, టిడిపి రాష్ట్ర ఎస్‌టి సెల్‌ జనరల్‌ సెక్రటరీ పాలవలస గౌరు సర్పంచ్‌ పాలవలస పార్వతి ఆధ్వర్యంలో మహిళలందరూ కామన్న వలస దగ్గర ఉన్న శివాలయానికి వెళ్లి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా చేశారు. కాగా పార్టీ కార్యకర్త గుండు గీయించుకుని నిరసన తెలిపారు. కొత్తవలస మండల కేంద్రంలోని నాలుగు రోడ్లు కూడలిలో టిడిపి నాయకులు సోమవారం రాస్తారోకో, మానవహారం చేపట్టారు. పలు ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, స్థానిక వ్యాపారవేత్తలు, దుకాణాలు మూసివేసి స్వచ్చందంగా సహకరించి రాష్ట్ర బంద్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన యువనేత గొరపల్లి రవి, మండల పార్టీ అధ్యక్షుడు గొరపల్లి రాము, లంక శ్రీను, టిడిపి నాయకులు బొబ్బిలి అప్పారావు, కోళ్ల వెంకటరమణ (శ్రీను), బంగారు రమేష్‌, కనకాల శివ, మాకెన సీతారామపాత్రుడు (నవీన్‌), పొట్నూరు వెంకట రత్నాజి, గొంప దుర్గా ఉమేష్‌, లాలం అర్జునరావు, పాల్గొన్నారు. వంగర మండల కేంద్రంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద టిడిపి నాయకులు సోమవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బలిజిరెడ్డి శ్రీనివాసరావు, మజ్జి గణపతి, మజ్జి శ్రీను, అప్పలనాయుడు, గొర్లె సింహాచలం, నెయ్యిగాపుల శ్రీను, ఆవు తిరుపతి పాల్గొన్నారు. శృంగవరపుకోట మండల కేంద్రంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో చేపట్టిన బందును పోలీసులు భగం చేశారు. ఆర్‌టిసి కాంప్లెక్స్‌ డిపోలో బస్సులను, సాయిబాబా గుడి నుండి దేవి గుడి వరకు స్థానిక వ్యాపారవేత్తలు, దుకాణాలు మూసివేసి బందులో స్వచ్ఛందంగా పాల్గొన్నప్పటికీ పోలీసులు బలవంతంగా దుకాణాలను తెరిపించారు. గజపతినగరం: టిడిపి, జనసేన నియోజకవర్గస్థాయి నాయకులు కరణం శివరామకృష్ణ, మర్రాపు సురేష్‌ ఆధ్వర్యంలో సోమవారం నాలుగు రోడ్ల జంక్షన్‌ వద్ద బంద్‌ నిర్వహించారు. మరోవైపు నియోజకవర్గ ఇంఛార్జి కెఎ నాయుడు వర్గమైన పివిపి రాజు, బండారు బాలాజీ, అట్టాడ లక్ష్మునాయుడు, రుంకాన అరుణలు ఒంటరిగా బందును నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్‌ మిడతాన రవికుమార్‌ పాల్గొన్నారు. మెంటాడ మండల కేంద్రంలో టిడిపి అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు ఆధ్వర్యంలో మోకాళ్లపై టిడిపి, జనసేన నాయకులు నిరసనలు తెలిపారు. బంద్‌లో భాగంగా ప్రైవేట్‌ గవర్నమెంట్‌ కార్యాలయాలతో పాటు వివిధ దుకాణాలను మూసివేసి రోడ్లపై బైఠాయించి అక్రమ అరెస్టుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాయిపిల్లి రవిశంకర్‌, రెడ్డి ఎర్నాయుడు, జనసేన మండల అధ్యక్షులు మండల సురేష్‌, టిడిపి మండల కార్యదర్శి సిరిపురపు గురునాయుడు పాల్గొన్నారు. పూసపాటిరేగ జాతీయ రహదారిపై సోమవారం టిడిపి, జనసేన నాయకులు నిరసన తెలిపారు. ఒకేసారి జాతీయ రహదారిపై ప్రత్యక్షమై రాస్తారోకొ నిర్వహించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని హైవే నుండి వారిని పక్కకు తొలగించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, జనసేన నెల్లిమర్ల నియోజకవర్గం ఇంచార్జ్‌ లోకం మాదవి, టిడిపి, జనసేన మండల అధ్యక్షలు మహంతి శంకరావు, జలపారి అప్పడుదొర, నాయకులు దంగా భూలోకా, పి. తమ్ము నాయుడు, ఆకిరి ప్రసాదరావు, విక్రం జగన్నాదం, సన్యాసినాయుడు, శ్రీనువా సరావు, గోపి, పాల్గొన్నారు. జామి మండల కేంద్రంలో సోమవారం తెల్లవారి జాము నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి, బంధు నిర్వహించారు. పాఠశాలలను మూయించారు. జామి బస్‌స్టాండ్‌లోని స్టేట్‌ బ్యాంకు, గ్రామీణ బ్యాంకులు మూయించారు. రోడ్లపై రాస్తా రోకో నిర్వహించి, సైకో సిఎం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వెంకట త్రివేణి, శ్రీలక్ష్మి, వెండ్రాపు నాయుడు బాబు, రాయవరపు శంకర్రావు, బొట్టా రమణ, అర్జున్‌, రమణ తదితరులు పాల్గొన్నారు. తెర్లాం: మండలం కేంద్రంలోని టిడిపి నాయకులు ఎన్‌ వెంకటేశ్వరరావు, ఎన్‌ వెంకట్‌ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. పట్టణంలో షాపులు, ప్రభుత్వ కార్యాల యాలు, అంగన్వాడీ సెంటర్లను మూసి వేయించారు. రేగిడి: రాజాం పట్టణంలో మెయిరోడ్డులో నియోజకవర్గ ఇంచార్జి. కొండ్రు మురళీ మోహన్‌ ఆధ్వర్యంలో రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల టిడిపి నాయకులు, నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. బస్సులు, వాహనాలు, నిలిపివేశారు. టిడిపి కార్యకర్త కె రమణ గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నారు జనార్ధనతోపాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.