Sep 08,2023 21:57

గజపతినగరం.. సమావేశంలో మాట్లాడుతున్న ఎడి మహారాజన్‌

గంట్యాడ: ప్రతి రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు సస్యరక్షణపై అవగాహన కల్పించాలని ఎంపిపి పీరుబండి హైమావతి అన్నారు. శుక్రవారం ఎంపిడిఒ కార్యాలయంలో మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని చైర్మన్‌ రంధి రామునాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులను అందించాలన్నారు. పనిముట్లు, ఆయిల్‌ ఇంజిన్లు, టార్పాలిన్లు, స్ప్రేయర్లు పంపిణీ చేయాలని సూచించారు. ఉద్యానశాఖ ద్వారా మండలానికి పామాయిల్‌ యూనిట్‌ మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి వర్రి నరసింహమూర్తి, ఎస్‌సి సెల్‌ జిల్లా అధ్యక్షులు పీరుబండి జైహింద్‌కుమార్‌, లక్కిడాం పిఎసిఎస్‌ అధ్యక్షులు లచ్చిరెడ్డి కృష్ణ, ఎఒ పి.శ్యామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
గజపతినగరం : మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని ఎడి కె.మహారాజన్‌ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంట విస్తీర్ణం, పంట నమోదు ప్రక్రియ గురించి వివరించారు. ఉద్యానశాఖ, ఆయిల్‌పాంకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను ఉద్యాన శాఖాధికారి రాజశేఖర్‌ వివరించారు. కార్యక్రమములో వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సామంతుల పైడిరాజు, ఎఒ ధనలక్ష్మి, డిటి సత్యనారాయణ, ఎంపిడిఒ కార్యాలయ సూపరింటెండెంట్‌ సుదర్శన్‌ పాల్గొన్నారు .