Aug 26,2023 21:00

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- బొబ్బిలి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు జరగనున్న సిపిఎం సమరభేరిను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు కోరారు. సమరభేరి గోడపత్రికలను శనివారం సిఐటియు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్‌, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందన్నారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని, విద్యుత్‌ చార్జీలు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 30,31న ప్రజల నుంచి సంతకాలు సేకరణ, సెప్టెంబర్‌ ఒకటిన సచివలయాలు వద్ద విద్యుత్‌ బిల్లులు దగ్ధం, 2న నిరుద్యోగ సమస్యపై పట్టణ, గ్రామాల్లో ప్రచారం, 3న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 4న తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని వెల్లడించారు. సమర భేరిను జయప్రదం చేయాలని ప్రజలు, యువతను కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.గోపాలం, సభ్యులు బి.యుగంధర్‌, బి.వెంకటరమణ, కె.కృష్ణ పాల్గొన్నారు.