Sep 01,2023 21:54

నిరసన తెలుపుతున్న ఫ్యాప్టో సభ్యులు

ప్రజాశక్తి-రామభద్రపురం :   సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఫ్యాప్టో నాయకులు జెసి రాజు ఆధ్వర్యాన ఉపాధ్యాయులు నల్లరిబ్బన్లు ధరించి ప్లకార్డులతో నిరసన చేపట్టారు. సిఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రత్యామ్నాయంగా జిపిఎస్‌ను తెస్తామని ప్రభుత్వం చెపుతున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో సభ్యులు నాగభూషణం, కృష్ణంనాయుడు, రెడ్డి వేణు, శివున్నాయుడు తదితరులు పాల్గొన్నారు.